డాక్టర్లపై ఒత్తిడి.. తీవ్ర మానసిక ఆందోళనలో వారియర్లు

డాక్టర్లపై ఒత్తిడి.. తీవ్ర మానసిక ఆందోళనలో వారియర్లు

కరోనా వ్యాప్తితో టెన్షన్‌
నేషనల్‌‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌‌ మెంటల్‌‌ హెల్త్‌‌ సర్వేలో వెల్లడి
ప్రభుత్వ డాక్టర్లలోనే ఎక్కువ

హైదరాబాద్, వెలుగు: కరోనా తీవ్రత పెరిగిపోతున్న వేళ తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పని చేస్తున్నారు డాక్టర్లు. కానీ కరోనాకు త్వరగా ఎక్స్ పోజ్ అవుతున్నారు. వైరస్ బారిన పడుతున్నారు. దీంతో వాళ్లలో ఒత్తిడి పెరుగుతోంది. ట్రీట్‌మెంట్ టెన్షన్ తో మానసికంగా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. డాకర్ల ప్రస్తుత మానసిక పరిస్థితిపై డిపార్ట్‌‌మెంట్‌‌ ఆఫ్‌ సైకియాట్రీ, నేషనల్‌ ఇన్ స్టిట్యూట్‌‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌‌– న్యూరో సైన్సెస్‌‌ చేసిన స్టడీలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

ప్రతి ఐదుగురిలో నలుగురు
కరోనా వ్యాప్తితో తాము ఒత్తిడికి గురవుతున్నామని సర్వేలో పాల్గొన్న ప్రతి ఐదుగురు డాక్లర్లలో నలుగురు చెప్పారు. కొందరు మోస్తరుగా, మరి కొందరు ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నామని అన్నారు. సీనియర్ డాక్టర్లతో పోల్చితే 45 ఏండ్లలోపు వారిలోనే స్ట్రెస్ ఎక్కువగా ఉంటోంది. స్టడీలో పాల్గొన్న డాక్టర్లలో 90 శాతం మంది ఒత్తిడి సమస్యను ఎదుర్కొంటున్నామని చెప్పారు. వీరిలో 60 శాతం మంది ఒత్తిడి తీవ్రంగా ఉందని
తెలిపారు.

ఇంట్లో వాళ్లకు సోకుతుందని..
ఇంట్లో చిన్న పిల్లలు, 60 ఏండ్లు దాటిన పేరెంట్స్‌‌ ఉండే డాక్టర్లు… డ్యూటీకి వెళ్లేటప్పుడు, తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. ఇంట్లో వారికి కరోనా సోకితే దానికి తామే కారణమవుతామనే ఆలోచన తమను వేధిస్తోందని ఎక్కువ మంది చెప్పారు. ఇక లాక్‌‌ డౌన్‌‌ నుంచి ఇప్పటివరకు కరోనా మినహా ఇతర ఆరోగ్య సమస్యలపై హాస్పిటల్, క్లినిక్లిక్‌‌లకు వచ్చే వారి సంఖ్య 80 శాతానికిపైగా తగ్గిపోయింది.

సర్కారు డాక్టర్లపై ఎఫెక్ట్ ఎక్కువ
ప్రభుత్వ డాక్టర్లు, మెడికల్‌ స్టాఫ్‌లో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. ప్రభుత్వ హాస్పటల్స్‌‌లో సరైన వసతులు లేకపోడం వాళ్లను టెన్షన్‌‌కు గురి చేస్తోంది.

2 నెలల నుంచి ఇంటికి పోలే
ట్రీట్‌మెంట్‌లో డైరెక్టుగా ఉండే వాళ్లం కాబట్టి ఇంట్లో వాళ్లకు ఇబ్బంది రాకుండా జాగ్రత్త పడుతున్నాం. 2 నెలల నుంచి ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నా. హాస్పిటల్‌‌లో ఉన్నప్పుడు నార్మల్‌‌గానే అనిపిస్తున్నా పొద్దున వచ్చేటప్పుడు, రాత్రి వెళ్లేటప్పుడు కొంచెం ఒత్తిడి ఉంటోంది.
-పి.ఎస్‌‌.విజేందర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్

ఒత్తిడి ఉన్నా సాగిపోవాలి
కరోనా ఉన్నా చాలా మందిలో లక్షణాలు ఉండట్లేదు.పారాసిటమల్‌‌ వేసుకుని వచ్చే వాళ్లకు జ్వరం ఉన్నా తెలియదు. సమస్య లేదని సర్జరీ చేస్తే అందరం ఇబ్బంది పడాల్సి వస్తుంది. సమస్యలున్నా సాగిపోవాలి. – డాక్టర్‌‌ సంజీవ్ సింగ్‌‌ యాదవ్, జనరల్‌‌ సర్జన్, తెలంగాణ స్టేట్‌సెక్రటరీ, ఐఎంఏ

టెస్టింగ్ సెంటర్లలోనూ..
టెస్టింగ్‌‌ సెంటర్స్‌లో డ్యూటీ చేసే వాళ్లపై ఒత్తిడి ఉంది. టెస్ట్‌ ల కోసం వంద మంది వస్తే ఒకరిద్దరికైనా పాజిటివ్‌ వస్తోంది. టెస్ట్‌ ల విషయంలో ప్రొటోకాల్‌‌ కచ్చితంగా ఫాలో అవుతాం. అయినా మేం హైరిస్క్‌‌ లో ఉంటాం. ఫ్యామిలీ పరంగా ఆలోచిస్తే టెన్షన్‌‌ అనిపిస్తుంది. కరోనా టెస్టింగ్, ట్రీట్ మెంట్ డ్యూటీకి వచ్చినప్పటి నుంచి చాలెంజింగ్ తోపాటు స్ట్రెస్ కూడా ఉంటోంది.
– జి.శ్రీకాంత్, మెడికల్‌‌ ఆఫీసర్, కార్వాన్‌‌–1

For More News..

ఆక్స్‌‌‌‌ఫర్డ్‌‌‌‌ వ్యాక్సిన్ సేఫ్‌.. ఫేజ్ 1 ట్రయల్స్ సక్సెస్

సెక్రటేరియట్ కూల్చివేత కవరేజీకి అనుమతివ్వండి

ప్రజల ప్రాణాలు గాలికి వదిలేసి.. ఏం ఎల్గవెడ్తున్నరు?