ఈ ఐస్​ క్రీం తినకపోతే ప్రోటీన్స్​ కోల్పోతారు..

ఎండాకాలం ఐస్​ క్రీం తింటుంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది.  కూల్​ .. కూల్​ గా లోపలికి వెళ్తుంటే ఆ ఆనందమే వేరు కదా.. పిల్లలు ఐస్​ క్రీం అడుగుతుంటే  తల్లిదండ్రులు తినకుండా ఆపేస్తారు.. అయినా సరే పిల్లలు మారాం చేస్తుంటారు.  ఇలా ఐస్​క్రీమ్​ను తినకుండా నిరోధించే తల్లిదండ్రులు నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NDRI) ఓ సూచన చేసింది.  

పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే పోషక పదార్దాలు కలిగిన ఆహారం ఇవ్వాలి.  పోషకాహారం లోపిస్తే అనేక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది.   కొత్తగా NDRI కొన్ని రకాల పోషక విలువలతో ఐస్​ క్రీం తయారు  చేసిందని నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌డిఆర్‌ఐ) డైరెక్టర్ డాక్టర్ ధీర్ సింగ్ తెలిపారు.  పోషకాహార లోపంతో బాధపడేవారు దీనిని తింటే చాలా ప్రయజనం ఉందన్నారు.  ప్రస్తుతం ఈ ఐస్​ క్రీమ్​ సిద్దంగా ఉందని త్వరలోనే మార్కెట్​ లోకి విడుదల చేస్తామన్నారు. 

ప్రస్తుతం బయట లభించే ఐస్​ క్రీమ్స్​ లో 3.5 శాతం వరకు ప్రోటీన్స్​ ఉంటాయని.. కాని  NDRI తయారు చేసిన ఐస్​ క్రీమ్​ లో 8 నుంచి 10 శాతం వరకు ప్రోటీన్స్​ ఉంటాయని  డైరక్టర్​ తెలిపారు.  ఎక్కువ ప్రోటీన్స్​ ఉండే ఐస్​ క్రీమ్స్ తింటే పోషకాహార లోపంతో బాధపడే పిల్లలకు చాలా మంచిది.  ఈ ఐస్​ క్రీమ్​అందరూ తినేలా.. మంచి రుచితో.. పోషకాహార విలువలు ఎక్కువుగా ఉండే  ఫార్ములా సిద్దంగా ఉందని NDRI తెలిపింది.  ఈ ఫార్ములాతో ఇన్​స్టిట్యూట్​ లో తయారు చేశామన్నారు.  ఈ ఫార్ములాతో ఐస్​ క్రీమ్​ను తయారు చేయడానికి మూడేళ్లు పట్టిందని ఐస్ క్రీమ్ మేకింగ్ టీమ్‌  డాక్టర్. SA హుస్సేన్, డాక్టర్ రిత్ధమ్ ప్రసాద్ , డాక్టర్ యోగేష్ ఖేత్రా అన్నారు.

 NDRI తయారు చేసిన పోషకాల ఐస్​ క్రీమ్ ఫార్ములాను విక్రయించేందుకు సిద్దంగా ఉన్నామని డాక్టర్ ధీర్ సింగ్ తెలిపారు.  ఈ ఫార్ములాను కొనేందుకు పెద్ద ఐస్‌క్రీమ్ కంపెనీ హట్సన్  NDRIని సంప్రదించింది. ఇంకా అనేక కంపెనీలు కూడా సంప్రదిస్తున్నాయని తెలిపారు. డీల్​ కుదిరిన తరువాత ఆ కంపెనీ సిబ్బందికి  నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌డిఆర్‌ఐ) శిక్షణ ఇవ్వనున్నారు.  ఆ తరువాత లైసెన్స్​ ప్రక్రియ పూర్తిచేసిన కంపెనీ ఈ ఐస్‌క్రీమ్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తుందన్నారు.