59 ఏండ్ల వృద్ధుడికి అరుదైన సర్జరీ.. ఎరోటిక్ వాల్వ్ రీప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్​చేసిన మెడికవర్ ​హాస్పిటల్

హైదరాబాద్ సిటీ, వెలుగు: 59 ఏండ్ల వృద్ధుడికి బేగంపేట మెడికవర్​ హాస్పిటల్​అరుదైన ఎరోటిక్ వాల్వ్ రీప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సర్జరీని సక్సెస్​గా పూర్తి చేసింది. బీహార్​కు చెందిన ఓం ప్రకాశ్ అరుదైన లో–ఫ్లో, లో–గ్రాడియెంట్ ఎరోటిక్ స్టెనోసిస్​అనే అరుదైన గుండె సమస్యతో బాధపడుతున్నాడు. ఈ సమస్యతొ అతడి గుండె పంపింగ్​65 శాతం ఉండాల్సింది పోయి19 శాతానికి పడిపోయింది. సాధారణంగా గుండె పంపింగ్​20 శాతానికి తగ్గితే కచ్చితంగా గుండె మార్పిడి చికిత్స చేయాలి. ఇందుకోసం ఓం ప్రకాశ్​ బేగంపేట మెడికవర్ హాస్పిటల్స్​లోని  సీటీవీఎస్ డాక్టర్ సుధీర్​ను కలిశాడు.

పలు టెస్టుల తరువాత గుండె సమస్య చాలా క్లిష్టంగా ఉందని గుర్తించిన వైద్యులు.. ఎరోటిక్ వాల్వ్ రీప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ చేయాలని నిర్ధారణకు వచ్చారు. ఈ సర్జరీలో పేషంట్​10 శాతం మాత్రమే బతకడానికి అవకాశం ఉంటుంది. సర్జరీ సమయంలో గుండె సాగిపోవడం, వాల్వ్ పూర్తిగా దెబ్బతినడం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ అత్యంత క్లిష్టమైన రోటిక్ వాల్వ్ రీప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సర్జరీని అక్టోబర్ 23న పూర్తి చేశాడు. ఆ తర్వాత 48 గంటలపాటు వెంటిలేటర్ సపోర్ట్, క్రమంగా ఐనోట్రోపిక్ సపోర్ట్​ను అందించారు. 72 గంటల తర్వాత గుండె పనితీరు మెరుగుపడడంతో మెడిసిన్ ఇవ్వడం క్రమంగా తగ్గించారు.

ఆపై 7 రోజులు తర్వాత ఆయన ఆరోగ్యం మెరుగుపడడంతో..10 రోజు పేషంట్​ను డిశ్చార్జ్ చేశారు. అనస్థీషియా, కార్డియాక్, ఐసీయూ, ఫిజియోథెరపీ, పోషకాహార విభాగాలు పేషంట్​ను తొందరగా కోలుకోవడంలో ప్రత్యేక పాత్ర పోషించాయని డాక్టర్ సాకేత్ శుక్రవారం తెలిపారు. కార్యక్రమంలో సీటీవీఎస్​సర్జన్ డాక్టర్ సుధీర్, డాక్టర్లు మానస, రాజ్ కుమార్, అభిలాష్ పాల్గొన్నారు.