
తమిళనాడు లో హైస్పీడ్ ట్రయిన్ కు పెను ప్రమాదం తప్పింది. తిరువళ్లూరు జిల్లాలో ట్రాక్ కనెక్షన్ కు ఉండే రెండు బోల్టులు కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు తొలగించారు. ఈ విషయాన్ని రైల్వే సిబ్బంది సకాలంలో గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది.
తమిళనాడులో హై అలర్ట్ ప్రకటించారు. తిరువళ్ళూరు జిల్లా హరిచ్చాంద్రాపురం సమీపంలోని తిరువల్నగడు రైల్వేస్టేషన్ లో తమిళనాడు ఎక్స్ప్రెస్ కు భారీ ప్రమాదం తప్పింది. చెన్నై అరక్కోణం హైస్పీడ్ ట్రైన్ వస్తుందనగా కొంతమంది దుండగులు ట్రాక్ కనెక్షన్ బోల్టులు తొలగించారు. ఈ విషయాన్ని గమనించిన ట్రాక్ పై ఉండే రైల్వే సిబ్బంది సమీప వెంటనే సమీప రైల్వేస్టేషన్ లకు సమాచారమిచ్చారు. దీంతో ఆ రూట్లలో వచ్చే ట్రైన్లను ఎక్కడికక్కడ ట్రైన్ లను నిలిపివేసిశారు.
కాశ్మీర్ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. ఘటనా స్థలానికి 50 మందికి చేరుకున్న పోలీసులు... దుండగుల దుశ్చర్యపై ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధితకారులు.. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనకు పాల్పడిన వారికి గుర్తించేందుకు స్నిపర్ డాగ్ తో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. సీసీ సిసి కెమెరాల విజువల్ ఆధారంగా .. ఆ ప్రాంతంలో తిరిగిన వాహనాలు, మనుషుల వివరాలు సేకరిస్తున్నారు.