ఆర్మూర్‌‌‌‌ ఏసీపీ ఆఫీస్‌‌‌‌ వద్ద ఆందోళన

ఆర్మూర్‌‌‌‌ ఏసీపీ ఆఫీస్‌‌‌‌ వద్ద ఆందోళన
  • దుర్గాదేవి శోభాయాత్ర చేస్తుండగా సౌండ్‌‌‌‌బాక్స్‌‌‌‌లు లాక్కెళ్లిన పోలీసులు
  • విగ్రహంతో కలిసి ఏసీపీ ఆఫీస్‌‌‌‌ ఎదుట బైఠాయించిన యూత్‌‌‌‌ సభ్యులు

ఆర్మూర్, వెలుగు : దుర్గాదేవి శోభాయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన సౌండ్‌‌‌‌ బాక్స్‌‌‌‌లను పోలీసులను లాక్కెళ్లడాన్ని నిరసిస్తూ యువకులు ఆందోళనకు దిగారు. విగ్రహాన్ని ఏసీపీ ఆఫీస్‌‌‌‌ ఎదుట పెట్టి అక్కడే బైఠాయించారు. ఈ ఘటన సోమవారం ఆర్మూరులో జరిగింది. పట్టణానికి చెందిన త్రిపుర యూత్‌‌‌‌ సభ్యులు సోమవారం దుర్గాదేవి శోభాయాత్ర నిర్వహించారు. ఈ టైంలో పోలీసులు అక్కడికి వచ్చి సౌండ్‌‌‌‌బాక్స్‌‌‌‌లను తీసుకెళ్లారు. దీంతో ఆగ్రహానికి గురైన యూత్‌‌‌‌ సభ్యులు భజరంగ్‌‌‌‌ దళ్‌‌‌‌ సభ్యులతో కలిసి నిరసనకు దిగారు. 

అందరూ ఏసీపీ ఆఫీస్‌‌‌‌ వద్దకు చేరుకొని, దుర్గాదేవి విగ్రహాన్ని అక్కడే నిలబెట్టి ధర్నా చేపట్టారు డీజేకు పర్మిషన్‌‌‌‌ లేకపోవడంతో మూడు సౌండ్‌‌‌‌ బాక్స్‌‌‌‌లు పెట్టుకున్నామని, వాటిని పోలీసులు లాక్కెళ్లడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న వారికి బీజేపీ లీడర్లు సైతం మద్దతు ఇవ్వడంతో సుమారు గంటన్నర పాటు ఏసీపీ ఆఫీస్‌‌‌‌ వద్దే నిరసన తెలిపారు. పోలీసులు సౌండ్‌‌‌‌ బాక్స్‌‌‌‌లను తిరిగి ఇచ్చేయడంతో యూత్‌‌‌‌ సభ్యులు ఆందోళన విరమించారు.