నల్గొండ : మునుగోడు నియోజకవర్గం చండూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఆఫీసులోని కండువాలు, పోస్టర్లు, బ్యానర్లతో పాటు ఇతర సామాగ్రి కాలి బూడిదైంది. విషయం తెలుసుకున్న స్థానిక నేతలు కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్వర విచారణ జరిపి నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరారు.కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇవాళ చండూర్లో రేవంత్ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు దుండగులు నిప్పు పెట్టడం కలకలం సృష్టించింది.
మునుగోడు బైపోల్ హీట్ అంతకంతకూ పెరుగుతోంది. రాజకీయ పార్టీలన్నీ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రచార జోరు పెంచారు.