చెన్నూరు నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థుల విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుబట్టారు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి. నవంబర్ 9వ తేదీ ఉదయం నామినేషన్ దాఖలు చేయటానికి ఆఫీసుకు వచ్చిన వివేక్ వెంకటస్వామి కాన్వాయ్ ను దూరంగానే నిలిపివేశారన్నారు పోలీసులు.
Also Read :- గజ్వేల్‌లో నామినేషన్ వేసిన సీఎం కేసీఆర్
అదే సమయంలో. బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ వాహనాలను మాత్రం రిటర్నింగ్ ఆఫీస్ వరకు అనుమతించారని.. ఇక్కడే బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ గూండాయిజం ఏంటో స్పష్టంగా.. ప్రజల కళ్లకు కనిపించిందన్నారు వివేక్ వెంకటస్వామి.
ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, ప్రభుత్వ విప్ అంటూ ఏమీ ఉండదన్నారు. ఒకరికి ఒక రూల్, మరొకరికి మరో రూల్ ఉంటుందా అంటూ ప్రశ్నించారు. కాగా చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.