జగిత్యాల పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత

జగిత్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత నెలకొంది. ఓ సామాజిక వర్గానికి చెందిన మహిళపై ఎస్సై అనిల్ దాడి చేశాడని స్టేషన్ ముందు నిరసనకు దిగారు ఆమె బంధువులు. ఎస్సై అనిల్ ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించారు. 

ఎస్సై అనిల్ పై చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీ కవితను కలిసేందుకు బయల్దేరగా వారిని పోలీసులు అడ్డుకున్నారు.  అయినా కూడా  వారు వెనక్కి తగ్గకుండా ఎమ్మెల్సీ కవితను కలిసి ఫిర్యాదు చేశారు.

ఎస్సై అనిల్ పై చర్యలు తీసుకోవాలని బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మే 9న సాయంత్రం ఎస్సై అనిల్ భార్య కరీంనగర్  నుంచి జగిత్యాలకు బస్సులో వస్తుండగా ఓ సామాజికి వర్గానికి చెందిన మహిళతో గొడవ పడినట్లు సమాచారం. ఈ గొడవే ఆందోళనకు దారి తీసినట్లు తెలుస్తోంది.