జనగామ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.. మంత్రి పొంగులేటి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సభ దగ్గరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి రావడంతో టెన్షన్ నెలకొంది. సభకు రాకుండా అక్రమంగా అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులను సభకు అనుమతించాలని డీసీపీ రాజ మహేంద్ర నాయక్ ను కోరారు ఎమ్మెల్యే పల్లా. ఈ క్రమంలో జై కాంగ్రెస్, పల్లా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు.
ALSO READ | గుడ్ న్యూస్: రేపటి ( జనవరి 27 ) నుంచి అకౌంట్లో రైతు భరోసా డబ్బులు సీఎం రేవంత్
కాంగ్రెస్ కార్యకర్తలకు పోటీగా జై పల్లా అంటూ పోటాపోటిగా నినాదాలు చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు.దీంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం మొదలైంది.ఈ క్రమంలో అక్కడే ఉన్న పోలీసులు ఇరు వర్గాలను చేదరగొడుతూ నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ పరిస్థితి కంట్రోల్ అవ్వకపోవడంతో లాఠీచార్జ్ చేశారు.