రాయలసీమలోని అత్యంత సమస్యాత్మకమైన నియోజకవర్గం అయిన తాడిపత్రి ఉద్రిక్తంగా మారింది. పోలింగ్ ప్రారంభం అయిన తర్వాత రిగ్గింగ్ జరుగుతుందని.. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. టీడీపీ వర్గాలు పోటాపోటీగా ఆందోళనలకు దిగాయి. వైసీపీ, టీడీపీ వర్గాలు ఇద్దరూ రోడ్లపై రాళ్ల దాడులు చేసుకుంటూ బీభత్సం చేశారు. తాడిపత్రికి రణరంగం చేశారు.
విషయం తెలుసుకుని స్పాట్ కు వచ్చిన పోలీస్ బలగాలపైనా రెండు వర్గాలు రాళ్లతో దాడి చేయటంతో.. కొద్దిసేపు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అప్పటికే తాడిపత్రి బందోబస్తులో ఉన్న ఎస్పీ అమిత్ బర్డర్.. రాళ్ల దాడులు జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్నారు. రెండు వర్గాలపై లాఠీఛార్జి చేశారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవటం.. అదనపు బలగాలను పిలిపించారు. విషయం తెలుసుకున్న ఎన్నికల సంఘం సైతం.. తాడిపత్రికి అదనపు పోలీస్ బలగాలను పంపించింది.
వైసీసీ, టీడీపీ వర్గాల రాళ్ల దాడితో తాడిపత్రిలో హై టెన్షన్ నెలకొంది. మూడు పోలింగ్ బూతుల్లో ఓట్లు వేయటానికి వచ్చిన ఓటర్లు.. గొడవలను చూసి పరుగులు తీశారు. ప్రస్తుతానికి అల్లర్లు అదుపులోకి వచ్చాయని.. రాళ్ల దాడి చేసిన వారిని గుర్తించామని స్పష్టం చేశారు. దాడులపై కఠిన చర్యలు ఉంటాయని.. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారంటూ జిల్లా ఎస్పీ వార్నింగ్ ఇచ్చారు.