చిత్తూరులో హైటెన్షన్ : మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటిపై టీడీపీ రాళ్ల దాడి

ఏపీలో ఎన్నికల అనంతరం మొదలైన ఘర్షణలు, అల్లర్లు ఇంకా చల్లారలేదు. తరచూ ఎక్కడో ఒక చోట అధికార ప్రతిపక్షాల మధ్య చెలరేగుతున్న ఘర్షణలు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటిపై టీడీపీ శ్రేణులు రాళ్ళ దాడి చేయటం కలకలం రేపింది. ఎంపీ మిథున్ రెడ్డి రెడ్డప్ప ఇంటికి వెళ్లిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

టీడీపీ కార్యకర్తలు రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలో పరస్పరం రాళ్లదాడికి పాల్పడ్డారు ఇరువర్గాల నేతలు.ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ప్రస్తుతం భారీగా పొలిసు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు పోలీసులు.

Also Read:ఏపీ హత్యలు, అత్యాచారాలకు చిరునామా అయ్యింది... వినుకొండ ఘటనపై జగన్ ట్వీట్..