తెలంగాణ ఎన్నికల మూడ్ పీక్ కు చేరుకుంటుంది. ముఖ్యంగా కీలకమైన నియోజకవర్గాల్లో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రచారం హోరాహోరీగా ఉండగా.. తాయిలాలపై నిఘా పెట్టాయి రెండు పార్టీలు. ఈ క్రమంలోనే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో 2023 నవంబర్ 7వ తేదీ రాత్రి హైటెన్షన్ నెలకొంది.
కొడంగల్ నియోజకవర్గం రావులపల్లిలో స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి డబ్బులు పంచుతున్నడని తెలుసుకొని అక్కడికి వెళ్లారు మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి కొడుకు జగ్గప్ప . కారులో ఏమున్నాయో చూపించాలంటూ పట్నం నరేందర్ రెడ్డిని జగ్గప్ప పట్టుబట్టాడు.
విషయం తెలుసుకున్న మంత్రి పట్నం మహేందర్ రెడ్డి హుటాహుటిన రావులపల్లికి చేరుకున్నారు. పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఎమ్మెల్యే కారులో ఏమున్నాయో చూపించాలని భారీగా కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించాడు జగ్గప్ప. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత కొనసాగుతుంది.