![మహబూబాబాద్ టౌన్ లో ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు](https://static.v6velugu.com/uploads/2025/02/high-tension-in-mahaboobabad-town_TDfmbQzJa1.jpg)
మహబూబాబాద్ జిల్లా పట్టణ శివారులో ఉద్రిక్తత నెలకొంది. భద్రాచలం జాతీయ రహదారి నిర్మాణానికి భారీ పోలీస్ బందోబస్తు నడుమ సర్వే నిర్వహిస్తున్నారు రెవెన్యూ అధికారులు. అయితే 30 మంది భూ నిర్వాసితులు సర్వేను అడ్డుకున్నారు. పోలీసులకు , భూ నిర్వాసితుల కు మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని కురవి పీఎస్ కు తరలించారు.
సాలార్ తండా దగ్గర భూ నిర్వహితుల అందోళన కొనసాగుతోంది. మా భూములు మాకే కావాలంటూ భూ నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. ప్రాణలైన ఇస్తాం..భూములు వదులుకోబోం అంటూ సాలార్ తండా గిరిజన వాసులు నినాదాలు చేస్తున్నారు.
ALSO READ | రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు : ఎఎస్పీ చైతన్యరెడ్డి