హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మంత్రి కొండా సురేఖను కించపరిచేలా బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ కాంగ్రెస్ నేతలు తెలంగాణ భవన్ ముట్టడికి వచ్చారు. కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు కాంగ్రెస్ చేనేత కార్మిక విభాగం నాయకులు ప్రయత్నించారు. కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ నాయకులు దాడి చేశారు. ఇరు వర్గాల మధ్య కాసేపు తీవ్ర తోపులాట, వాగ్వాదం జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయియ. భారీగా చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.
ALSO READ | రైల్లో దాక్కొని తుపాకీతో ఉద్యమకారులను కాల్చిన చరిత్ర నీది :దాస్యం వినయ్ భాస్కర్
మంత్రి కొండా సురేఖను కించపరిచేలా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగంపై మండిపడ్డారు. మరోసారి మంత్రి కొండా సురేఖని అవమాన పరిస్తే బీఆర్ఎస్ నాయకుల ఇండ్ల ముందు వాళ్ల దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తామని హెచ్చరించారు.