మూసీ సర్వేను అడ్డుకున్న స్థానికులు ..చైతన్యపురిలో ఉద్రిక్తత

మూసీ సర్వేను అడ్డుకున్న స్థానికులు ..చైతన్యపురిలో ఉద్రిక్తత

మూసీ ప్రక్షాళనలో భాగంగా పరిపరివాహక ప్రాంతాల్లో  రెవెన్యూ అధికారులు సర్వేను వేగవంతం చేశారు. బఫర్ జోన్,మూసీ రివర్ బెడ్ పరిధిలోని ఆక్రమ నిర్మాణాలను  గుర్తించి మార్కింగ్ చేస్తున్నారు. 

 ఈ క్రమంలో  చైతన్య పురి వినాయక్ లో  మూసీ సర్వే కు వచ్చిన అధికారులను అడ్డగించారు స్థానికులు. మా ఇండ్లు కూల్చొద్దు.మాకు అన్ని రకాల రిజిస్ట్రేషన్ ఉన్నాయి. కరెంట్, వాటర్ సప్లయ్ ఉన్నాయి.ఇప్పుడు ఎందుకు వచ్చారు అంటూ అధికారులను నిలదీశారు స్థానికులు, కార్పొరేటర్ లు. ఓ యువకుడు పెట్రోలో పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్డడ్డాడు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.

Also Read :- నా కొడుకు అంత్యక్రియలకు స్థలం చూపించండి

 రాజేంద్రనగర్  తహసీల్దార్ సిబ్బందిని, రెవెన్యూ, మున్సిపల్, ఎలక్ట్రికల్‌ అధికారులను  సర్వే వద్దు వెళ్లి పోండంటూ మహిళలు అడ్డుకున్నారు. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో రింగ్ రోడ్డుకు అడ్డంగా కూర్చుని నిరసనకు దిగారు డిఫెన్స్ కాలనీ వాసులు.  దీంతో  కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అయ్యింది. తమకు అన్యాయం చేస్తున్నారని  స్థానికులు నినాదాలు చేశారు. 

  • Beta
Beta feature
  • Beta
Beta feature