ఏడు హైటెన్షన్ టవర్లు కూలిపోయినయ్
భారీ వానలతో కరెంట్ సప్లై బంద్
సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లకు ఎఫెక్ట్
చీకట్లో వందలాది గ్రామాలు
హైదరాబాద్, వెలుగు: భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్నది. వరంగల్ కేంద్రంగా ఉన్న ఎన్‌పీడీసీఎల్ పరిధిలో వరద బీభత్సానికి విద్యుత్ లైన్ల టవర్లే కొట్టుకుపోయాయి. సబ్‌స్టేషన్లు నీట మునిగాయి. విద్యుత్‌లైన్ల పై చెట్లు కూలి సరఫరా వ్యవస్థ ఎఫెక్ట్ అయింది. స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నార్నర్త్ డిస్కంకు వానల దెబ్బ పడింది. దీంతో రాష్ట్రంలో రూ.కోట్ల నష్టం జరిగినట్లు విద్యుత్ యంత్రాంగం అంచనా వేసింది. ప్రస్తుతం వర్షం కాస్త తెరపివ్వడంతో అధికారులు రిపేర్లు చేస్తున్నారు.
చీకట్లో ఊళ్లు
ట్రాన్స్‌కో ద్వారా విద్యుత్ సరఫరా చేసే భారీ హైటెన్షన్ టవర్లు వరదల్లో కొట్టుకుపోయాయి. నార్తర్న్ డిస్కం పరిధిలో కరీంనగర్ జిల్లాలో 220 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న 7 హైటెన్షన్ టవర్లు నేలకూలినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పలు ప్రాంతాల్లో సబ్ స్టేషన్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి వందలాది గ్రామాలు చీకట్లో ఉండిపోయాయి. సబ్‌స్టేషన్లు నీట మునగడంతో ముందస్తు చర్యగా పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థను నిలిపివేశారు. మంగళవారం సాయంత్రానికి కొన్ని ప్రాంతాల్లో కరెంటు సరఫరా పునరుద్ధరించారు. భూపాలపల్లి, ములుగు, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల్లో పవర్ సిస్టమ్ దెబ్బతిన్నది. నార్తర్న్ డిస్కం పరిధిలో 33 కేవీ సబ్ స్టేషన్లు నీట మునిగాయి. 54 గ్రామాలు నీట మునగడంతో అక్కడ విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దాదాపు 248 ట్రాన్స్ ఫార్మర్లకు విద్యుత్ సప్లైని నిలిపివేశారు. ప్రస్తుతం అక్కడ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. బావులు, బోర్ల వద్ద ఉండే మోటర్ల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిపివేశారు.
ప్రత్యేకంగా టీమ్‌లు
దెబ్బతిన్న పవర్ సిస్టమ్ ను మెరుగు పరిచేందుకు డిస్కం లు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాయి. ప్రజలు విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. స్తంభాలు, కరెంటు తీగలు, ట్రాన్స్ ఫార్మర్లు, సర్వీస్ వైర్ల వద్ద షాట్ సర్క్యూట్ కాకుండా అప్రమత్తం చేశారు. టోల్ ఫ్రీ నంబర్‌తోపాటు స్థానిక సబ్‌స్టేషన్లు, విద్యుత్ సంస్థల వద్ద ఏర్పాటుచేసిన ఫ్యూజ్ ఆఫ్ కాల్ సెంటర్ల ద్వారా బ్రేక్ డౌన్స్ సమాచారం సేకరించారు. ప్రత్యేక టీమ్‌లను రంగంలోకి దించి రిపేర్లు చేపట్టారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో స్పెషల్ టీమ్‌లను రంగంలోకి దించినట్లు అధికారులు పేర్కొన్నారు.
For More News..
మన టిక్ టాక్ యాప్స్.. హైస్టార్.. అలాప్
కన్ఫ్యూజన్ వద్దు.. గణేశ్ ఉత్సవాలు జరుపుకోండి
కడప సెంట్రల్ జైళ్లో 317 మందికి కరోనా