
మలక్పేట: చాదర్ ఘాట్ చిన్న బ్రిడ్జిపై సోమవారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. ఈదురు గాలులకు బ్రిడ్జిపై హైటెన్షన్ విద్యుత్ వైర్ తెగిపడింది. ఈ ఘటనలో స్కూటీపై వెళ్తున్న వ్యక్తికి త్రుటిలో ప్రమాదం తప్పింది. వైర్ తెగడాన్ని గమనించిన వాహనదారుడు స్కూటీని రోడ్డుపైనే వదిలేశాడు. మిగతా వాహనాలు సైతం ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇచ్చి, కరెంట్ సరఫరాను ఆపివేశారు. అనంతరం రాకపోకలను పునరుద్ధరించారు.