ఇండ్లపై తెగిపడిన హైటెన్షన్ వైర్..భయంతో వణికిపోయిన స్థానికులు

ఇండ్లపై తెగిపడిన హైటెన్షన్ వైర్..భయంతో వణికిపోయిన స్థానికులు
  • శ్రీనగర్​కాలనీ వడ్డెర బస్తీలో ఘటన 
  • భయంతో వణికిపోయిన స్థానికులు
  • స్థానిక విద్యుత్​ సబ్ స్టేషన్​ముందు ఆందోళన

పంజాగుట్ట, వెలుగు: పంజాగుట్ట పోలీస్​స్టేషన్​పరిధిలోని శ్రీనగర్​కాలనీలో శనివారం పెను ప్రమాదం తప్పింది. ఉదయం 8 గంటల సమయంలో స్థానిక  వడ్డెర బస్తీ మీదుగా వెళ్తున్న హైటెన్షన్​కరెంట్​వైర్​తెగి ఇండ్లు, గవర్నమెంట్​స్కూల్ బిల్డింగ్​పై పడింది. 

గమనించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. వైర్​తెగిపడిన వెంటనే కరెంట్​సప్లయ్​నిలిచిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ట్రిప్​అవడంతో మూడు ట్రాన్స్​ఫార్మర్లకు సరఫరా బంద్​అయింది. మూడు గంటల పాటు కరెంట్​సప్లయ్​నిలిచిపోయింది. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా విద్యుత్ అధికారులు పట్టించుకోవడంలేదంటూ స్థానికులు శ్రీనగర్​కాలనీ విద్యుత్​సబ్​స్టేషన్​వద్ద ఆందోళనకు దిగారు. హైటెన్షన్​లైన్లను తొలగించాలని డిమాండ్​చేశారు. 

పంజాగుట్ట ఇన్​స్పెక్టర్​ శోభన్, స్థానిక కార్పొరేటర్​వనం సంగీత యాదవ్​ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యుత్​శాఖ అధికారులతో మాట్లాడారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. కొత్త కేబుల్​ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పారు. కాగా రెండేండ్ల కింద ఇలాగే హైటెన్షన్​వైర్​తెగి పడింది.

 అదే టైంలో మేడపై బట్టలు ఆరేస్తున్న మణిలా అనే మహిళపై పడడంతో తీవ్రంగా గాయపడింది. చికిత్స పొందుతూ 21 రోజుల తర్వాత మృతి చెందింది. గాలిపటం ఎగరవేస్తుండగా హైటెన్షన్​వైర్లకు మాంజా తాకి ఓ బాలుడు స్పాట్​లో చనిపోయాడు.