ఈ టైమ్‌లో ఎగ్జామ్స్‌ పెట్టాలనుకుంటున్నరా?

ఈ టైమ్‌లో ఎగ్జామ్స్‌ పెట్టాలనుకుంటున్నరా?

టెన్త్‌ పరీక్షలపై ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, ఇలాంటి టైమ్‌లో టెన్త్‌ పరీక్షలు పెట్టాలనుకుంటున్నారా అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత కేసులు ఎక్కువవుతున్న విషయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందో లేదో చెప్పాలంది. టెన్త్‌ పరీక్షలను వాయిదా వేయాలంటూ హైదరాబాద్‌కు చెందిన ఎం. బాలకృష్ణ, సీహెచ్‌ సాయిమణి వరుణ్‌, మరొకరు వేసిన వ్యాజ్యాలను గురువారం విచారించిన కోర్టు ఈ కామెంట్స్‌ చేసింది. పరీక్షల ఏర్పాట్లపై కోర్టుకు నివేదిక ఇచ్చామని ఏజీ చెప్పగా.. తమకు అందలేదని, శుక్రవారం విచారణ చేస్తామని చెప్పింది. కోర్టు అనుమతిస్తే పరీక్షలు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, 8 నుంచి నిర్వహించాలనుకుంటున్నట్లు ధర్మాసనానికి విద్యా శాఖ నివేదిక సమర్పించింది. పరీక్ష గదులను శానిటైజ్‌ చేస్తామని, స్టూడెంట్లకు శానిటైజర్లు ఇస్తామని చెప్పింది. అనారోగ్యం, జలుబు ఉన్న వారికి వేరే గదుల్లో పరీక్షలు పెడతామంది. 2,330 ఎగ్జామినేషన్‌ సెంటర్లను 3,425కు పెంచామని.. అన్ని పరీక్ష కేంద్రాల దగ్గర వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతామంది.

For More News..

ప్రతిపక్షాలోళ్లు సెకండ్ క్లాస్ పౌరులా?

నోటిఫికేషన్ టైమ్‌ అయిపోయినా.. డిక్లరేషన్ ఎట్లిచ్చిన్రు?