- బిగ్ బీ సినిమా రిలీజ్ కాకుండా స్టే ఇవ్వలేం
- తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటించిన ఝుండ్ విడుదల కాకుండా స్టే ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమా వివాదాల కారణంగా ఆగిపోయింది. అఖిలేశ్ పాల్ జీవితం ఆధారంగా సినిమా తీస్తున్నారని చిన్నిప్రకాశ్ కూకట్‌పల్లి జిల్లా కోర్టులో సివిల్ దావా వేసి ఇంజక్షన్ ఆర్డర్ పొందారు. తర్వాత వివాదాన్ని రాజీ చేసుకున్నారు. సినిమా శుక్రవారం విడుదలయ్యే సమయంలో బుధవారం మళ్లీ అదే కోర్టులో కేసు వేసి రాజీ బెడిసికొట్టిందని మరో కేసు వేశారు. ఇందులో సినిమా రిలీజ్ కాకుండా ఆర్డర్ రాకపోవడంతో చిన్నిప్రకాశ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై గురువారం విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్.. రిలీజ్ కాకుండా ఆర్డర్ ఇవ్వాలన్న పిటిషనర్ లాయర్ వాదనను నిరాకరించింది. ప్రైవేట్ వ్యక్తి రిట్ ఎలా జారీ చేయగలమని ప్రశ్నించింది. తీర్పును రిజర్వ్ చేసింది.