దేశంలో నిన్న రికార్డుస్థాయిలో కరోనా కేసులు

దేశంలో నిన్న రికార్డుస్థాయిలో కరోనా కేసులు

క‌రోనావైర‌స్ దేశంలో రోజురోజుకూ విజృంభిస్తోంది. రెండురోజులకొక లక్ష కేసుల నమోదవుతున్నాయి. గ‌డిచిన తొమ్మిది రోజులుగా ప్రతిరోజూ 50 వేలకు పైగా కేసులు న‌మోద‌వుతున్నాయి. తాజాగా ఆ సంఖ్య 62 వేల‌ు దాటింది. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా రికార్డు స్థాయిలో అత్యధికంగా 62,538 క‌రోనా కేసులు నమోదయ్యాయి. ఒకేరోజులో ఇన్ని పాజిటివ్ కేసులు న‌మోద‌ుకావడం ఇదే మొద‌టిసారి. తాజాగా నమోదయిన కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 20,27,075కు చేరింది. వీటిలో 6,07,384 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కరోనా బారినపడి కోలుకున్న వారి సంఖ్య 13,78,106కు చేరుకుంది. గురువారం కరోనా వల్ల 886 మంది మ‌ర‌ణించారు. దాంతో దేశంలో మొత్తం క‌రోనా మృతుల సంఖ్య 41,585కు పెరిగింద‌ని కేంద్ర కుటుంబ మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది.

ఇప్పటివరకు దేశంలో 2,27,24,134 శాంపిళ్లను ప‌రీక్షించామ‌ని.. నిన్న ఒక్క రోజే 5,74,783 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేశామ‌ని ఐసీఎంఆర్ ప్ర‌క‌టించింది.

For More News..

ఒక్క బ్లాస్ట్ ఖరీదు రూ. లక్ష కోట్ల నష్టం

చైనాకు చెందిన 2,500 యూట్యూబ్ చానెల్స్‌‌‌‌పై వేటు

కరోనా వారియర్స్ కు ఇన్సెంటివ్ ఇయ్యట్లే