ఎండ సుర్రుమంటోంది

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత రెండు రోజులుగాఎండలు మండుతున్నాయి. భానుడి ప్రతాపానికి  ఉదయం 10 గంటల  నుంచే ఎండలు భగ్గుమంటున్నాయి. వేడి గాలుల తాకిడికి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. ఎండ తీవ్రతకు రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఆఫీసులు, స్కూల్లు, ఇతర పనులకు బయటకు వెళ్లే వారు టవళ్లు, స్కార్పులు కట్టుకుంటున్నారు. చిరు వ్యాపారులు గొడుగుల నీడలో వ్యాపారం కొనసాగిస్తున్నారు. -వెలుగు ఫోటోగ్రాఫర్, ఆదిలాబాద్