Weather Report: దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత రాయలసీమలో మండుతున్న ఎండలు

Weather Report: దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత రాయలసీమలో మండుతున్న ఎండలు

ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ఎండలు దంచికొడుతున్నాయి. మార్చిలోనే మాడు పగిలే రేంజ్ లో ఎండలతో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఈ సంవత్సరం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని IMD అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. గత వారం ఏర్పడిన ద్రోణి వల్ల పలు ప్రాంతాల్లో వాతావరణం చల్లబడినా కొన్ని ప్రాంతాల్లో మాత్రం రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం నాడు అనంతపురంలో దేశంలోనే అత్యధికంగా 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఈ నెల 27వరకు ఎండ వేడి, ఉక్కపోత ఇలాగె కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా శనివారం కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసిన నేపథ్యంలో రాగాల 24గంటలు వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతున్నాయని, రానున్న 5రోజుల పాటు వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు తెలిపారు. రానున్న 5 రోజులు ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఎండా తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏప్రిల్ ఆఖరి వారం, మే నెల ప్రారంభంలో ఉష్ణోగ్రత 50డిగ్రీలకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అధికారులు అంటున్నారు.