బిచ్కుందలో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత

బిచ్కుందలో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత

కామారెడ్డి , వెలుగు: కామారెడ్డి జిల్లాలోఎండల తీవ్రతపెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. బుధవారం అత్యధికంగా బిచ్కు​ందలో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

 పాత రాజంపేట, పెద్ద కొడపగల్‌లో 39.9  డిగ్రీలు, బొమ్మదేవునిపల్లి, సర్వాపూర్​ల్లో 39.5 డిగ్రీలు, తాడ్వాయిలో 39.3, మేనూర్​లో 39.2, భిక్కనూరు , సోమూరుల్లో 38.7,  వెల్పుగొండలో  38.6,  పిట్లం 38.5 జుక్కల్​లో 38.2,  హసన్​పల్లిలో  38.1,  సదాశివనగ్​లో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.