దేశ వ్యాప్తంగా 15 నగరాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు

దేశవ్యాప్తంగా ప్రతీ ఏటా ఎండ తీవ్రత గణనీయంగా పెరుగుతోంది. వేసవి కాలం సమీపించే సమయానికి కనీసం ఒక డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఈ సారి కూడా దీనికి భిన్నమైన పరిస్థితులేమీ కనిపించట్లేదు. వేసవి సమీపించిందంటే చండ ప్రచండమైన ఎండ తీవ్రత రికార్డవుతోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతున్న నగరాల జాబితాల్లో 15 సిటీలు మనదేశానికి చెందినవే కావడం ఆందోళనకరంగా మారింది. ఈ 15 నగరాల్లో మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం టాప్ లో ఉంది. విదర్భ ప్రాంతానికి ఆరు నగరాలు ఈ జాబితాలో చేరాయి. తెలంగాణలోని ఆదిలాబాద్ కూడా ఈ జాబితాలో స్థానం దక్కించుకుంది.

వాతావరణానికి సంబంధించిన వార్తలను మాత్రమే ప్రచురించే ఎల్ డొరాడో అనే వెబ్ సైట్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే నగరాలపై సర్వే చేసింది.  తర్వాత ఆయా నగరాల జాబితాను ప్రకటించింది. అత్యధికంగా 15 నగరాలతో మనదేశం ఈ జాబితాలో టాప్ లో ఉంది. 47 డిగ్రీల వరకు ఎండ తీవ్రత ఉన్నప్పటికీ.. ప్రజలు బయట తిరగొచ్చని, ఈ స్థాయిని మించి ఎండ తీవ్రత అధికరంగా నమోదైతే బయట తిరగ కూడదని హెచ్చరించింది.