పొట్టు పొట్టు కొట్టుకున్న హిజ్రాలు.. చూస్తూ ఎంజాయ్ చేసిన జనాలు

సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తిలో హిజ్రాలు రెచ్చిపోయారు. రెండు వర్గాలుగా మారి దారుణంగా ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. ఒకరిని ఒకరు జుట్టు పట్టుకొని, ఒంటిపై ఉన్న బట్టలు లాక్కుంటూ గొడవకు దిగారు. సూర్యాపేట, తిరుమలగిరి హిజ్రాలకు మధ్య ఈ గొడవ జరిగింది. తుంగతుర్తిపై హక్కు మాకంటే మాకే ఉంటుందని.. రెండు వర్గాలుగా మారి నడిరోడ్డుపై కొట్టుకున్నారు. 

నడిరోడ్డుపైనే ఇంత జరుగుతున్నా.. స్థానికులంతా ఆ ప్రాంతంలోకి చేరుకొని ఏం చేయాలో తెలియక సినిమా చూసినట్లు చూశారు. దీంతో ఆ ప్రాంతమంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హిజ్రాలు కొట్టుకున్న వీడియోలను అక్కడ  ఉన్నవారు తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియోలు వైరల్ గా మారాయి.