
కోల్ బెల్ట్, వెలుగు: ప్రేమ, పెండ్లి పేరుతో వేధిస్తున్నాడంటూ ఓ యువకుడి ఇంటి ముందు హిజ్రాలు ఆందోళనకు దిగారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో శనివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పట్టణంలోని ఫస్ట్జోన్సింగరేణి కమ్యూనిటీ హాల్ఏరియాకు చెందిన ట్రాన్స్ జెండర్ చందనతో అదే ఏరియాకు చెందిన అజయ్‌కు మూడు నెలల కింద పరిచయం ఏర్పడింది. క్లోజ్‌గా ఉండడంతో చందనను పెండ్లి చేసుకుంటానని అజయ్కొంతకాలంగా వేధిస్తున్నాడు.
అతని బారి నుంచి రక్షించాలని యువకుడి ఇంటి ముందు తోటి హిజ్రాలతో కలిసి బాధితురాలు ఆందోళనకు దిగింది. అజయ్తనను ట్రాప్ చేశాడని, ప్రేమ, పెండ్లి పేరుతో వేధించడంతో పాటు తన వద్ద డబ్బులు, ఇతర వస్తువులు తీసుకున్నాడని ఆరోపించింది. దీంతో పోలీసులు అక్కడి చేరుకొని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. మరోవైపు వేధింపుకు గురిచేస్తున్న యువకుడు అజయ్‌ను బైండోవర్చేసినట్లు మందమర్రి ఎస్ఐ రాజశేఖర్తెలిపారు.