బిగ్ బాష్ లీగ్ లో కళ్లుచెదిరే సిక్సర్ నమోదయింది. మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌పై మెల్‌బోర్న్ స్టార్స్ బ్యాటర్ హిల్టన్ కార్ట్‌రైట్ ఏకంగా 121 మీటర్ల సిక్సర్ కొట్టి ఆశ్చర్యపరిచాడు. 4 బంతుల్లో 8 పరుగులు చేయాల్సిన దశలో రోజర్స్ వేసిన బంతిని కార్ట్‌రైట్ లాంగన్ దిశగా భారీ సిక్సర్ బాదాడు. మెల్ బోర్న్ రెండో స్టేర్ లోకి వెళ్లి బంతి పడడం విశేషం. ఈ సిక్సర్ కి ప్రేక్షకులతో పాటు కామెంట్రీ వారు సైతం షాక్ అయ్యారు. సిక్సర్ కొట్టడంతో పాటు ఇదే ఊపులో మ్యాచ్ విన్నింగ్ రన్స్ కూడా కార్ట్‌రైట్ కొట్టాడు.
169 పరుగుల లక్ష్య ఛేదనలో మెల్‌బోర్న్ స్టార్స్ కు మంచి ఆరంభం లభించలేదు. 41 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఆ జట్టు కష్టాల్లో పడింది. ఈ దశలో బెన్ డకెట్, మార్కస్ స్టోయినీస్ భారీ భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. 83 పరుగుల భాగస్వామ్యంతో జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లారు. ఈ దశలో వరుస విరామాల్లో డకెట్(67), మార్కస్ స్టోయినీస్(48) స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. చివర్లో మ్యాచ్ ఉత్కంఠకు దారి తీయగా.. మ్యాక్స్ వెల్, కార్ట్‌రైట్ జట్టుకు విజయాన్ని అందించారు.
ALSO READ | SA vs PAK: పాకిస్థాన్‌పై సఫారీ బ్యాటర్ పంజా.. డబుల్ సెంచరీతో విధ్వంసం
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన మెల్‌బోర్న్ రెనెగేడ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 168 పరుగులు చేసింది. టాపార్డర్ విఫలమైనా జాకబ్ బెతేల్, జోనాథన్ వెల్స్ జట్టును ఆదుకున్నారు. నాలుగో వికెట్ కు 71 పరుగులు జోడించి జట్టును ముందుకు నడిపారు చివర్లో ఇవాన్స్ 11 బంతుల్లోనే 2 ఫోర్లు.. సిక్సర్ తో జట్టుకు భారీ స్కోర్ అందించాడు.
HUUUUUUGE from Hilton Cartwright 🚀
— ESPNcricinfo (@ESPNcricinfo) January 4, 2025
via @BBL | #BBL14 pic.twitter.com/YiPC8ykWlJ