ఉదారత చాటుకున్న హిమాచల్ ప్రదేశ్ సీఎం

  • తన సేవింగ్స్‌‌ మొత్తం విరాళమిచ్చిన హిమాచల్ సీఎం
  • సీఎస్‌‌కు రూ.51 లక్షల చెక్కు అందించిన సుఖ్విందర్​

సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సుఖు తన ఉదారతను చాటుకున్నారు. భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు తాను దాచుకున్న డబ్బు మొత్తం విరాళంగా అందజేశారు. తన మూడు వ్యక్తిగత సేవింగ్స్‌‌ ఖాతాల్లో ఉన్న రూ.51 లక్షలకు సంబంధించిన చెక్కును తన భార్యతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రబోధ్ సక్సేనాకు అందజేశారు.

ALSO READ: టెట్ ఎగ్జామ్​ రాసేందుకు వచ్చిన గర్భిణి మృతి

‘‘ఇదంతా నా వ్యక్తిగత సేవింగ్స్‌‌ నుంచి ఇస్తున్నా. విపత్తు సహాయ నిధిని ఏర్పాటు చేసినప్పటి నుంచి అనేకమంది చిన్నారులు తమ పిగ్గీ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులను సహాయంగా అందించారు” అని ఆయన చెప్పారు. అధికారులు, ఉద్యోగులు, వృద్ధులు తమ శక్తి మేరకు సాయం చేశారని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌‌లో కురిసిన వానలకు రూ.8,680 కోట్ల నష్టం వాటిల్లింది. 2,615 ఇండ్లు పూర్తిగా కూలిపోగా, 11,022 ఇండ్లు పాక్షికంగా డ్యామేజ్ అయ్యాయని ప్రభుత్వం తెలిపింది.