జేఎన్టీయూలో హిమాచల్ మంత్రి రాజేశ్ ధర్మాణి

హైదరాబాద్ సిటీ, వెలుగు: తెలంగాణ యూనివర్సిటీల పర్యటనలో భాగంగా హిమాచల్ ప్రదేశ్ మంత్రి రాజేశ్ ధర్మాణి శనివారం జేఎన్టీయూహెచ్​ను సందర్శించారు. తొలుత రెక్టర్ కె. విజయకుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ కె. వెంకటేశ్వరరావు మంత్రి బృందానికి స్వాగతం పలికారు. వర్సిటీ లక్ష్యాలు, సాధనలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎగ్జామ్స్ సెల్, జే హబ్, ఇన్‌క్యుబేషన్ సెంటర్ తదితర పురోగతిపై రాజేశ్ ధర్మాణి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్షా విధానాల్లో మార్పులు, ఆటోమేటెడ్ క్వశ్చన్​ పేపర్ల తయారీ, ఆధునిక మూల్యాంకన విధానాలు, రికార్డుల డిజిటలైజేషన్ అంశాలపై చర్చించారు.