బీజేపీకి షాక్.. దానం నాగేందర్ సమక్షంలో కారెక్కనున్న కార్పొరేటర్ దంపతులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా ఇతర పార్టీలోకి వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. 

తాజాగా హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి, ఆమె భర్త రామన్ గౌడ్ బీజేపీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. 

రాజీనామా తర్వాత ఈరోజు(నవంబర్ 03) ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆద్వర్యంలో దంపతులిద్దరూ బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపు టికెట్ ఆశించి.. భంగపడ్డారు రామన్ గౌడ్. టికెట్ దక్కకపోవడంతో దంపతులిద్దరూ బీజేపీకి రాజీనామా చేసి.. బీఆర్ఎస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది.

ALSO READ :    కురుమూర్తి బ్రహ్మోత్సవాలు సక్సెస్  చేయాలి : కలెక్టర్ జి. రవినాయక్