హైదరాబాద్, వెలుగు: ఈ నెల 16 నుంచి 19 వరకు నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ మెషీన్ టూల్ అండ్ ఇంజనీరింగ్ ఎక్స్‌పో (హిమ్టెక్స్) జరగనుంది. ఇదే సందర్భంగా మూడో ఎడిషన్ ఇండియా ప్రాసెస్ ఎక్స్‌పో అండ్ కాన్ఫరెన్స్ (ఐపీఈసీ), ఎకో సస్టైన్ ఎక్స్‌పో 8వ ఎడిషన్ ఉంటాయి. హిమ్టెక్స్లో మెషీన్ టూల్స్, ఆటోమేషన్, రోబోటిక్స్, ఇంజినీరింగ్‌కు చెందిన 300 మంది ఎగ్జిబిటర్స్ పాల్గొంటారు.వీరంతా కొత్త టెక్నాలజీలను, ఇన్నోవేషన్లను ప్రదర్శిస్తారని హైటెక్స్ బిజినెస్ హెడ్ శ్రీకాంత్చెప్పారు. ఐపీఈసీ ప్రాసెస్ పరిశ్రమలలో ఆవిష్కరణలను వెలుగులోకి తెస్తుంది. ఎకో సస్టైన్ ఎక్స్‌పో పర్యావరణ అనుకూల టెక్నాలజీలపై దృష్టి సారిస్తుంది. వృత్తిపరమైన అభివృద్ధి అవకాశాలపై చర్చించడానికి నెట్‌వర్కింగ్ సెషన్లను కూడా నిర్వహిస్తారు.