
- పహల్గాం టెర్రర్ అటాక్ను ఖండిస్తూ నటి హీనా ఖాన్ పోస్ట్
న్యూఢిల్లీ: పహల్గాం టెర్రర్ అటాక్ ను ఖండిస్తూ బాలీవుడ్ నటి హీనాఖాన్ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది. ‘‘ముస్లీములమని చెప్పుకునే హృదయం లేని, బ్రెయిన్ వాష్ చేసిన ఉగ్రవాదులు ఈ దాడి చేసిన విధానం చాలా దారుణం.
తమను తాము ముస్లింలుగా చెప్పుకుని ఎదుటి వారిపై కరుణ చూపకుండా కాల్పులు జరిపిన విధానం భయంకరమైనది. నేను దీన్ని ఖండిస్తున్నాను. ఈ ఘటన నా హృదయాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఒక ముస్లింగా, నా తోటి హిందువులందరికీ, భారతీయులందరికీ నేను క్షమాపణలు చెబుతున్నాను.” అని హీనా ఖాన్ పేర్కొంది.