హిందీ పుష్పరాజ్కు డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్

హిందీ పుష్పరాజ్కు డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్

పుష్ప(Pushpa) సినిమా హిందీ వర్షన్ లో అల్లు అర్జున్ కు డబ్బింగ్ చెప్పిన బాలీవుడు నటుడు శ్రేయాస్ తల్పాడే(Shreyas Talpade) గుండెపోటుకు గురయ్యారు. షూటింగ్‌ నుండి ఇంటికి వచ్చిన శ్రేయాస్ కాస్త అసౌకర్యానికి గురయ్యారు అనంతరం.. అక్కడికక్కడే కుప్పకూలిపోవడంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతనికి యాంజియోప్లాస్టీ నిర్వహించగా.. ప్రస్తుతం శ్రేయాస్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇక శ్రేయాస్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన వెల్కమ్ టు జంగిల్ అనే మల్టీస్టారర్ మూవీ చేస్తున్నారు. ఇక మరాఠీ సీరియల్స్, స్టేజ్ షోలతో నార్త్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శ్రేయాస్. ఇక పుష్ప హిందీ వర్షన్ లో అల్లు అర్జున్ కు డబ్బింగ్ చెప్పడం ద్వారా మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నాడు శ్రేయాస్ తల్పాడే.