ప్రభాస్ అలాంటివాడంటూ కామెంట్స్ చేసిన దేవర తల్లి..

ప్రభాస్ అలాంటివాడంటూ కామెంట్స్ చేసిన దేవర తల్లి..

టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ కి ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా నేషనల్ వైడ్ పాపులారిటీ ఉంది. అలాగే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ప్రభాస్ ఎప్పుడూ కూడా డౌన్ టూ ఎర్త్ ఉంటాడు. దీంతో చాలామంది ప్రభాస్ ని లైక్ చేస్తుంటారు. అయితే ప్రభాస్ గురించి ప్రముఖ హిందీ నటి జరీనా వాహబ్ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 

ఇందులోభాగంగా ప్రభాస్ నైస్ పర్సన్ అని అలాగే సినిమా సెట్స్ లో ప్రతి ఒక్కరితో చాలా సరదాగా ఉంటాడని తెలిపింది. ఈ క్రమంలో స్టార్ నటీనటులు, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ అనే భేదం అస్సలు చూపించడాని ఈ అంశం నాకు బాగా నచ్చిందని చెప్పుకొచ్చింది. అలాగే సినిమా షూటింగ్ సెట్స్ నుంచి ఆకలి అని ప్రభాస్ ఇంటికి వెళితే ఎంతమందికైనా ఫుడ్ రెడీ చేయించి కడుపునిండా పెట్టి పంపిస్తాడని అటువంటి హీరోని ఇప్పటివరకూ తన సినీ కెరీర్ లోనే చూడలేదని పేర్కొంది. 

ప్రస్తుతం తాను ప్రభాస్ తో కలసి "ది రాజాసాబ్" సినిమాలో హీరో తల్లి పాత్రలో నటిస్తున్నానని తెలిపింది. ప్రభాస్ లాంటి వ్యక్తి తన రియల్ లైఫ్ లో కొడుకుగా పుట్టివుంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ "మా డార్లింగ్ రియల్లీ గ్రేట్" అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ALSO READ | David Warner: స్టార్ హీరో సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్న డేవిడ్ వార్నర్..?

ఈ విషయం ఇలా ఉండగా నటి జరీనా వాహబ్ తెలుగులో ప్రముఖ స్టార్ హీరో ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాలో హీరో తల్లి పాత్రలో నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతోపాటూ దాదాపుగా రూ.600 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ తో పాటూ తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ భాషాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటిస్తోంది.

ఇక ది రాజాసాబ్ విషయానికొస్తే ప్రముఖ డైరెక్టర్ మారుతీ దాసరి హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాత టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఇటీవలే ప్రభాస్ బర్త్ డే సందర్భంగా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చెయ్యగా మంచి రెస్పాన్స్ వచ్చింది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్యాన్ ఇండియా భాషలలో ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది.