మన జాతీయ భాషగా హిందీ నేడు జాతీయ భాషా దినోత్సవం

మన జాతీయ భాషగా హిందీ నేడు జాతీయ భాషా దినోత్సవం

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14ను "హిందీ దివస్"గా జరుపుకుంటారు. 1949వ సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీన హిందీ భాషను అధికారిక భాషగా ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి ఈ తేదీన హిందీ దివస్​గా  జరుపుకోవడం ఆనవాయితీ. శుద్ధ హిందీ భాషను రేడియోలలో, టీవీ వార్తలలో వినవచ్చు. ప్రస్తుతం చలామణిలో ఉన్న హిందీ భాష చాలా వరకూ సులభతరం చేయబడింది. ప్రపంచంలోని చాలా దేశాలలో హిందీ భాషను మాట్లాడతారు. మారిషస్,  ట్రినిడాడ్, అమెరికా, దక్షిణాఫ్రికా, న్యూజిల్యాండ్ వంటి చాలా దేశాలలో ఇప్పటికీ హిందీ వాడుకభాషగా ఉంది.  మనలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే ప్రపంచంలోనే ఎక్కువగా మాట్లాడే భాషలలో హిందీ భాష రెండోది కావడం. ఇది మనం అందరం గర్వించదగిన విషయం. మన జాతిపిత మహాత్మా గాంధీ  కూడా దేశంలో ఐక్యతను తీసుకురావడానికి ఈ భాషనే వాడేవారు. 

ఈ భాషను ‘లాంగ్వేజ్ ఆఫ్ యూనిటీ’ అనేవారు. అంత గొప్పది మన హిందీ భాష. అందుకే అన్నారు మేరా భారత్ మహాన్ అని. కాబట్టి హిందీ నేర్చుకుంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భాష సమస్య పెద్దగా ఉండదనే అభిప్రాయం కూడా ఉంది.  మనం రోజూ వాడే భాష   మనని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మన ఆలోచనలను, మన సంస్కృతిని భారత జాతీయోద్యమంలో సాధారణ ప్రజలందరిని ఏకతాటిపై నడిపేందుకు హిందీ భాష  ఎంతగానో సహాయపడింది. ఆ స్ఫూర్తితోనే 1949 సెప్టెంబరు 14న రాజ్యాంగంలోని 351వ అధికరణం 8వ షెడ్యూల్‌‌‌‌లో హిందీని జాతీయభాషగా గుర్తిస్తూ ఆ రోజుల్లో పొందుపరిచారు. హిందీ దివస్ రోజు ప్రత్యేకంగా అనేక పాఠశాలలు, కళాశాలలు వివిధ సాహిత్య-, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తాయి, అలాగే ఈ రోజు ప్రాముఖ్యతను ప్రదర్శించడానికి, భాషపై అవగాహన పెంచడానికి పోటీలను నిర్వహిస్తాయి.

- యాడవరం చంద్రకాంత్ గౌడ్,
సిద్దిపేట