
బషీర్బాగ్, వెలుగు: వచ్చే నెలలో జాతీయ స్థాయిలో హిందీ ప్రచార సభ హైదరాబాద్ 90వ వార్షికోత్సవాలు నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పలు రకాల పోటీలు, కార్యక్రమాలు జరపనున్నారు. కార్యక్రమావాల్ పోస్టర్ ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా శనివారం ఆవిష్కరించారు. హిందీ ప్రచార సభ హైదరాబాద్ అధ్యక్షుడు ప్రొఫెసర్ చంద్రదేవ్ కావ్డే, ప్రధాన కార్యదర్శి ఎస్.గైబువల్లి, సభ్యులతో మంత్రి ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. హిందీ ప్రచార సభ హైదరాబాద్ 90వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని ఈనెల 20వ తేదీ నుంచి కళాశాల, పాఠశాల విద్యార్థులకు పలు పోటీలు నిర్వహిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి ఎస్.గైబువల్లి వెల్లడించారు. వివరాలకు 8639884145, 93910 52988, 98484 39522, 96030 61892లో సంప్రదించాలని కోరారు.