మధ్యప్రదేశ్ కు చెందిన టీవీ నటి చహత్ పాండే ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ సమక్షంలో 2023 జూన్ 29 గురువారం రోజున ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో చహత్ పాండే పార్టీ కండువా కప్పుకున్నారు.
दमोह, Madhya Pradesh से Famous TV Actress Chahat Pandey, AAP National Gen. Secy. (Org) @SandeepPathak04 जी की उपस्थिति में आज AAP में शामिल हुईं।
— AAP (@AamAadmiParty) June 29, 2023
AAP परिवार उनका हार्दिक स्वागत करता है।?
देश में बदलाव चाहने वाले लोग ही AAP को और सशक्त करेंगे, AAP के विकास कार्यों को घर-घर… pic.twitter.com/JmJU725zrW
ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని పార్టీ నిర్ణయించింది.
24 ఏళ్ల చహత్ పాండే 17 ఏండ్ల వయసులోనే పవిత్ర బంధం షోతో టీవీ రంగంలో అడుగుపెట్టారు. ఆపై ఆమె హమారి బహు సిల్క్, దుర్గా మాత కీ ఛయ్య, నాథ్-జవర్ య జంజీర్ అనే టీవీ సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషించి విశేష ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. ఆమె ప్రస్తుతం నాథ్-జంజీర్ యా జెవార్ అనే టీవీ షోలో మహువా పాత్రను పోషిస్తోంది.
మధ్యప్రదేశ్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 230 స్థానాలకు గాను 114 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 109 సీట్లు గెలుచుకుంది.కమల్ నాథ్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
అయితే ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామల నేపథ్యంలో జ్యోతిరాదిత్య సింధియా కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది. శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం తిరిగి ఏర్పటైంది. ప్రస్తుతం జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో ఉన్నారు.