హిందూ-ముస్లిం ఫ్రెండ్షిప్ ఏంటి.. సిగ్గులేదా..? పార్కులో జంటపై యువకుల దాడి.. ప్రభుత్వం సీరియస్

హిందూ-ముస్లిం ఫ్రెండ్షిప్ ఏంటి.. సిగ్గులేదా..? పార్కులో జంటపై యువకుల దాడి..  ప్రభుత్వం సీరియస్

పార్కులు, పబ్లిక్ ప్లేస్ లలో ఎవరైనా అబ్బాయి, అమ్మాయి కలిసి ఉంటే ఆకతాయిల మోరల్ పోలీసింగ్ ఇన్సిడెంట్ లు తరచుగా చూస్తూనే ఉన్నాం. వాళ్లు ఫ్రెండ్స్ అయినా సరే.. అన్నా చెళ్లెల్లు అయినా సరే..  సమాజానికి మేమే కాపలా దారులం అన్నట్లుగా కొందరు వ్యవహరిస్తుంటారు. అందులో ఇద్దరూ వేర్వేరు మతాలకు చెందినవారైతే మరింత మితిమీరి ప్రవర్తిస్తుంటారు. సేమ్ అలాంటి ఇన్సిడెంటే ఒకటి బెంగళూరులో జరిగింది. సరదాగా మాట్లాడుకుంటున్న ఇద్దరినీ తీవ్రంగా దూషించి, దాడి చేసి మోరల్ పోలీసింగ్ కు పాల్పడ్డారు ఐదుగురు యువకులు. ఈ ఘటన సంచలనంగా మారటంతో ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. 

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఐదుగురు ముస్లిం యువకులు క్లాస్ మేట్స్ అయిన హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయిని హరాష్ చేశారు. బురఖా ధరించిన అమ్మాయి తన ఫ్రెండ్ బైక్ పైన కూర్చుని ఒకరితో ఒకరు మాట్లాడుతుండగా.. ‘‘ఇక్కడెందుకు ఉన్నారు..? హిందూ అబ్బాయితో ఏం పని.. మీ పేరెంట్స్ కాంటాక్ట్ నంబర్ చెప్పు’’ అని బెదిరించారు. ఒక ముస్లిం అయి ఉండి హిందూ అబ్బాయితో కూర్చోవడానికి సిగ్గులేదా..?’’ అని హరాష్ చేసినట్లు అమ్మాయి పోలీసులకు తెలిపింది. 

‘‘మేమిద్దరం క్లాస్ మేట్స్...’’ అని అమ్మాయి చెప్పినా వినకుండా అబ్బాయిపై దాడికి దిగారు. అమ్మాయి పేరెంట్స్ నెంబర్ ఇవ్వక పోవడంతో అబ్బాయిని హరాష్ చేస్తూ దాడికి దిగారు. ఆ ఫ్రెండ్స్ ఇద్దరినీ వీడియో తీసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు. ‘‘అమ్మాయి నుంచి మాకు కంప్లైంట్ వచ్చింది. నలుగురిని అరెస్టు చేశాం. అందులో ఒక మైనర్ (జువనైల్) కూడా ఉన్నాడు’’ అని డీసీపీ ఎస్.గిరీష్  తెలిపారు. 

Also Read:-పోటెత్తిన నిరుద్యోగులు.. వరంగల్ మెగా జాబ్ మేళాలో తొక్కిసలాట

ఈ ఘటన బెంగళూర్ సువర్ణ లేయౌట్ పార్క్ లో జరగింది. దాడికి దిగిన వారిని మహిమ్, అఫ్రీది, వసీమ్, అంజుమ్ తో పాటు ఒక మైనర్ ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. సమాజంలో మోరల్ పోలీసింగ్ ఎక్కువైందని, రెండు మతాలకు చెందిన వారైతే ఇంకా అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్నారని సోషల్ మీడియాలో పలువురు మండిపడుతున్నారు. వేర్వేరు మతాల వారైతే ఫ్రెండ్ షిప్ చేయవద్దా.. మాట్లాడవద్దా.. ఇలాంటి చర్యలను ఉపేక్షించవద్దని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు.