దాయాది దేశం పాక్‌లో భారతీయ మహిళ నడుపుతున్న ఓ ఫుడ్ స్టాల్ స్థానికంగా బాగా పాప్యులారిటీ సాధించింది. భారతీయ వంటకాలు అనేకం అందుబాటులో ఉండే ఈ స్టాల్‌కు స్థానికులు క్యూ కడుతుంటారు. పాక్‌కు చెందిన ఓ యువకుడు దీని గురించి వీడియో చేసి నెట్టింట పంచుకోవడంతో ఈ ఉదంతం తెగ వైరల్ (Viral) అవుతోంది.
కరాచీ నగరంలో కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఈ స్టాల్ ఉంది. దీని పేరు కవితా దీదీ కా ఇండియన్ ఖానా. కవిత అనే మహిళ, ఆమె కుటుంబసభ్యులు ఈ స్టాల్ కలిసి నిర్వహిస్తుంటారు. ఇక్కడ వెజ్, నాన్ వెజ్ వంటకాలన్నీ లభిస్తాయి. ముఖ్యంగా భారతీయ వంటకాలైన పావ్‌భాజీ, వడాపావ్, దాల్ సమోసా వంటివి జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి. కరామత్ అనే యూట్యూబర్ కవిత ఫుడ్ స్టాల్ గురించి వీడియో రికార్డు చేసి నెట్టింట పోస్ట్ చేశాడు. దీంతో, ఇది విపరీతంగా వైరల్ అవుతోంది (Hindu familys food stall in Karachi gets loads of love).
కరాచీలో ఓ హిందూ కుటుంబం నిర్వహిస్తున్న ఫుడ్‌స్టాల్‌ను సందర్శించిన తర్వాత పాకిస్థానీ బ్లాగర్ తన అనుభవాన్ని పంచుకున్నాడు. కవితా దీదీ కా ఇండియన్ ఖానా అనేది కరాచీలోని కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ సమీపంలో కవిత మరియు ఆమె కుటుంబ సభ్యులు నడుపుతున్న ఫుడ్ కార్ట్ పేరు. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఒక పోస్ట్‌లో, కరామత్ ఖాన్ కవితా స్టాల్‌ను డాక్యుమెంట్ వీడియోను పోస్ట్ చేశారు. పాక్ లో హిందూ ఫ్యామ్లీ నిర్వహించే ఫుడ్ స్టాల్లో పావ్ భాజీ, వడ పావ్ దాల్ సమోసా ఫేమస్. కవిత దీదీ చేసే ఫుడ్ చాలా టేస్ట్‌గా ఉంటుందని కరాచీ వాసులు చెబుతున్నారు.
వడా పావ్ ముంబైలో చాలా ఫేమస్. ఇప్పుడు కరాచీ వాసులు కూడా దీన్ని ఇష్టపడుతున్నారని కవిత వీడియోలో పేర్కొన్నారు. తొలిసారిగా వడ పావ్‌ను తిన్న కరామత్ ఆ వంటకాన్ని కూడా మెచ్చుకున్నారు. కరాచీలోని ఆహార ప్రేమికులు యువ పారిశ్రామికవేత్తను కవితా దీదీ అని ప్రేమగా పిలుస్తారని కరామాత్ చెప్పారు. కరాచీలోని తన ఫుడ్ స్టాల్ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయ్యింది.ఈ వీడియోలో కరామత్.. కవిత ఫుడ్ స్టాల్ గురించి స్థానికులను పలకరించారు. అనేక మంది ఈ ఫుడ్ స్టా్ల్‌లో ఆహారం భలే రుచిగా ఉంటుందని చెప్పారు. భారతీయ వంటకాలు అద్భుతంగా ఉంటాయని అనేక మంది అన్నారు. తరచూ వచ్చి ఇక్కడే తింటుంటామని మరికొందరు చెప్పారు. పాక్‌లో ఇంతగా ఓ భారతీయ ఫుడ్ స్టాల్ పాప్యులర్ కావడంపై ఇక్కడి వారు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.