Ban Maharaj Movie: వివాదంలో అమీర్ ఖాన్ కొడుకు సినిమా.. బ్యాన్ చేయాలంటూ డిమాండ్

Ban Maharaj Movie: వివాదంలో అమీర్ ఖాన్ కొడుకు సినిమా.. బ్యాన్ చేయాలంటూ డిమాండ్

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్(Amir khan) కొడుకు జునైద్‌ ఖాన్(Junaidh khan) హీరోగా పరిచయం అవుతున్న మూవీ మహారాజ్(Maharaj). నిజ‌జీవిత ఘ‌ట‌న‌ల ఆధారంగా వస్తున్న ఈ సినిమాను ద‌ర్శ‌కుడు సిద్దార్థ్ పి మ‌ల్హోత్రా తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ లో జూన్ 14 నుండి ఈ  సినిమా స్ట్రీమింగ్ కి రానుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాపై వివాదం నెలకొంది. ఈ మధ్య ఈ సినిమా ట్రైలర్ విడుదలైన నేపధ్యంలో అందులోని సన్నివేశాలు హిందువుల మనోభావాలు దెబ్బతీషేలా ఉన్నాయని, వెంటనే ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ కొన్ని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సాధువుల‌ను, హిందు మ‌త పెద్ద‌ల‌ను ఈ సినిమాలో నెగెటివ్ కోణంలో చూపించార‌ని, వారిని కామాదులుగా కూడా చూపించే ప్రయత్నం చేశారు అంటున్నారు. అలాంటి సినిమాతో ఆమీర్ ఖాన్ తన కొడుకుని పరిచయం చేయడం సరికాదని మండిపడుతున్నారు. అంతేకాదు.. ఈ సినిమా స్ట్రీమింగ్ చేస్తున్న నెట్ఫ్లిక్స్ సంస్థను సైతం ఇండియాలో బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ డిమాండ్స్ పై మహారాజ్ సినిమా మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.