![జ్ఞానవాపి కేసులో సుప్రీంను ఆశ్రయించిన హిందువులు](https://static.v6velugu.com/uploads/2024/01/hindu-side-files-new-supreme-court-plea-on-gyanvapi-mosque-in-varanasi_Rk6tqvDO3c.jpg)
న్యూఢిల్లీ: జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలోని వజూఖానా సీల్ ను తొలగించాలని కోరుతూ హిందువులు సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శివలింగానికి హాని కలగకుండా వజూఖానాలో సర్వే చేపట్టేందుకు ఏఎస్ఐని అనుమతించాలని కోరారు.
‘‘తవ్వకం, ఇతర శాస్త్రీయ పద్ధతుల ద్వారా ఏఎస్ఐ సర్వే చేపట్టాలి. ఆ రిపోర్టును కోర్టుకు సమర్పించాలి. శివలింగం ప్రాంతం చుట్టూ అసలు భవనంతో సంబంధం లేకుండా ఆధునిక నిర్మాణం జరిగింది. ఈ ప్రాంతంతో ముస్లింలకు ఎటువంటి మతపరమైన ప్రాముఖ్యత లేదు” అని పిటిషన్ లో పేర్కొన్నారు.
కాగా, వజూఖానాకు సీల్ వేయాలని 2022లో సుప్రీంకోర్టు ఉత్వర్వులిచ్చింది. వారణాసిలోని ఆలయాన్ని కూల్చేసి ఈ మసీదును నిర్మించారని ఏఎస్ఐ సర్వే రిపోర్టును సమర్పించిన కొన్ని రోజులకే హిందూ పిటిషనర్లు సుప్రీంను ఆశ్రయించారు.