![దుబాయ్లో హిందూ దేవాలయం.. అద్భుతం](https://static.v6velugu.com/uploads/2022/10/Hindu-Temple-in-Dubai-Amazing-I-will-must-visit..says-Anand-Mahindra_fy3BnIgYqv.jpg)
సామాజిక మాధ్యమాల్లో నిత్యం చురుగ్గా ఉండే మహీంద్రా గ్రూప్ సంస్థ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తాజాగా దుబాయ్ లో ఉన్న అద్భుతమైన హిందూ దేవాలయాన్ని షేర్ చేశారు. భారత, అరబిక్ నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ ఆలయాన్ని మంగళవారం ప్రారంభించగా.. ఆనంద్ మహీంద్రా వెంటనే ట్విట్టర్ ద్వారా స్పందించారు.
‘‘ఈ దేవాలయం అద్భుతంగా ఉంది.. ఈసారి దుబాయ్ వెళ్లినప్పుడు తప్పకుండా సందర్శిస్తాను..’’ అంటూ ఆనంద్ మహీంద్రా ట్విట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆసక్తికర విషయాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకునే ఆనంద్ మహీంద్రా ట్వీట్ ను ఇప్పటికే చాలా మంది చూసి రీట్వీట్ లు చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం.. మీరు కూడా చూసేయండి..