బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హిందువులపై దాడులు ఆపాలి

బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హిందువులపై దాడులు ఆపాలి
  • మహబూబ్ నగర్ సిటీలో హిందూ ఐక్యవేదిక  నిరసన ర్యాలీ 

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు : బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇస్కాన్ స్వాములు, ఆలయాలు, హిందువులపై దాడులను ఆపాలని డిమాండ్ చేస్తూ హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. 

కార్యక్రమంలో హిందూ ఐక్య వేదిక కన్వీనర్ సీమ నరేందర్, ప్రతినిధులు మద్ది యాదిరెడ్డి మెట్టుకడి శ్రీనివాసులు, రెబ్బ విగ్నేశ్ కాంత్, రాజమల్లేశ్, వసంతపు వెంకటేశ్, మఠం మయుర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్, అధ్యాత్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.