
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా-పాక్ హైటెన్స్ మ్యాచ్ టైంలో.. పాకిస్తాన్ ప్రధాని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ‘‘అభివృద్ధిలో ఇండియాను వెనకకు నెట్టకుంటే నా పేరు షెహబాజ్ షరీఫ్ కాదు’’ అని పాక్ ప్రధాని చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
డేరా ఘాజీ ఖాన్ ర్యాలీలో పాక్ లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు షరీఫ్. పాకిస్తాన్ అభివృద్ధిలో కమిట్ మెంట్ తో పనిచేస్తున్నామని, ఈ విషయంలో త్వరలోనే ఇండియాను క్రాస్ చేస్తామని అన్నారు. ప్రపంచలోనే పాక్ ను గొప్ప దేశంగా తీర్చి దిద్దుతామని, ఈ విషయంలో ఇండియాను ఓడిస్తామని చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది.
If I don't defeat #India, my name is not Shehbaz Sharif," says PM Shehbaz, pledging to outpace regional rivals like India in development. Speaking in Dera Ghazi Khan, he emphasized the need for unprecedented federal-provincial collaboration to steer Pakistan towards progress.… pic.twitter.com/nQudEuLH2K
— Ghulam Abbas Shah (@ghulamabbasshah) February 22, 2025
ముందు పాకిస్తాన్ లో ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ క్రీడలు సక్సెస్ ఫుల్ గా జరిపి చూపించమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ పాక్ ఇండియాను దాటేందుకు ప్రధాని పేరు మార్చుకోవడం కాదని ముందు ఆ దేశం పేరు మార్చుకోవాలని కొందరు సూచిస్తున్నారు.
ఇవాళ (ఫిబ్రవరి 23) ఇండియా vs పాక్ హైటెన్స్ మ్యాచ్:
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ ఇండియా-పాక్ మ్యాచ్ దుబాయ్ లో జరుగుతోంది. ఇండియా ఓపెనింగ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను ఓడించింది. మరోవైపు పాకిస్తాన్ న్యూజీలాండ్ చేతిలో ఓడిపోయింది. అయితే టోర్నమెంట్లో ఉండాలంటే ఇవాళ పాక్ కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్. పాక్ తో మ్యాచ్ అంటే చెలరేగే ఇండియా ప్లేయర్లు ఇవాళ కూడా ఇరగదీస్తారని, కచ్చితంగా ఇండియా గెలుస్తుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. ఈ టైం లో పాక్ ప్రధాని వ్యాఖ్యలు చేయడం మరింత చర్చనీయాంశం అయ్యింది.