
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) 276 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంఎస్సీ (కెమిస్ట్రీ), లా డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
అర్హత : ఇంజినీరింగ్ పోస్టులకు గరిష్ట వయసు 25 సంవత్సరాలు. ఆఫీసర్ కేటగిరీ పోస్టులకు 26 నుంచి 29 ఏళ్లు, జనరల్ మేనేజర్ పోస్టుకు 50 ఏళ్లు. గరిష్ఠ వయసులో ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్‌కు 5 ఏళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్)కి 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10- నుంచి 15 ఏళ్ల సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు. మిగిలినవారు ఫీజు రూ.1180 ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.
ఎగ్జామ్ ప్యాటర్న్ : అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. లా ఆఫీసర్స్, లా ఆఫీసర్స్ (హెచ్‌ఆర్) పోస్టుల ఎంపికకు మూట్‌కోర్ట్‌ను నిర్వహిస్తారు. అభ్యర్థులను ఎంపిక చేసి వారికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) నిర్వహిస్తారు.
దరఖాస్తులు : అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ 18 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.hindustanpetroleum.com వెబ్సైట్లో సంప్రదించాలి.