హిండ్‌‌‌‌‌‌‌‌వేర్ కొత్త సీఈఓగా నిరుపమ్ సహాయ్‌‌‌‌‌‌‌‌

హిండ్‌‌‌‌‌‌‌‌వేర్ కొత్త సీఈఓగా నిరుపమ్ సహాయ్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు:  బాత్‌‌‌‌‌‌‌‌వేర్ బ్రాండ్‌‌‌‌‌‌‌‌ హిండ్‌‌‌‌‌‌‌‌వేర్ లిమిటెడ్  తన శానిటరీవేర్, కుళాయిలు, టైల్స్ బిజినెస్‌‌‌‌‌‌‌‌లకు సీఈఓగా   నిరుపమ్ సహాయ్‌‌‌‌‌‌‌‌ను నియమించింది.  డిక్సన్ టెక్నాలజీస్‌‌‌‌‌‌‌‌లో   లైటింగ్ సొల్యూషన్స్ బిజినెస్ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌గా పనిచేసిన ఆయన హిండ్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జాయిన్ అయ్యారు.  ఫిలిప్స్ లైటింగ్, జీఈ క్యాపిటల్, వర్ల్‌‌‌‌‌‌‌‌పూల్,  ఏషియన్ పెయింట్స్‌‌‌‌‌‌‌‌ వంటి కంపెనీల్లో పనిచేసిన నిరుపమ్‌‌‌‌‌‌‌‌కు,  లైటింగ్, కన్జూమర్ డ్యూరబుల్స్, పెయింట్స్, ఆర్థిక సేవల రంగాల్లో విస్తృతమైన అనుభవం ఉంది. 

 ప్రస్తుతం ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్‌‌ స్టడీస్ ఇన్ కాంప్లెక్స్ ఛాయిసెస్ కోసం సలహా మండలి సభ్యుడిగా పనిచేస్తున్నారు. ఈ  సందర్భంగా హిండ్‌‌‌‌‌‌‌‌వేర్ లిమిటెడ్ చైర్మన్ సందీప్ సోమానీ మాట్లాడుతూ..‘నిరుపమ్‌‌‌‌‌‌‌‌కు భారతీయ మార్కెట్‌‌‌‌‌‌‌‌పై  లోతైన అవగాహన ఉంది. ఇన్నోవేషన్లపై దృష్టి సారించే ఆయన  హిండ్‌‌‌‌‌‌‌‌వేర్ బాత్‌‌‌‌‌‌‌‌వేర్ వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో నడుపుతారని నమ్ముతున్నాం’  అని అన్నారు.