
హైదరాబాద్, వెలుగు: వంట చేసేటప్పుడు పొగ, వాసన, జిడ్డును తొలగించడానికి హింద్‌వేర్ ఇమెల్డా పేరుతో బీఎల్డీసీ చిమ్నీని మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీనికి గరిష్టంగా 2000 ఎం3/అవర్ సక్షన్ సామర్థ్యం ఉంటుంది. వంట చేస్తున్నప్పుడు కూడా ఇది మీ కిచెన్ గాలిని సమర్థవంతంగా శుభ్రం చేయగలదు. బీఎల్డీసీ మోటార్ ఉండటం వల్ల పెద్దగా శబ్దం లేకుండా ప్రశాంతంగా వంట చేయవచ్చు.
ఇందులో ఫిల్టర్లు ఉండవు కాబట్టి అదనపు ఖర్చు ఉండబోదని హింద్‌వేర్ తెలిపింది. దీని వలన నిర్వహణ చాలా సులభం అవుతుంది.థర్మల్ ఆటో క్లీన్ ఫీచర్ శుభ్రం చేసే ఇబ్బందిని తగ్గిస్తుంది. జిడ్డు, మురికిని తొలగించడానికి చిమ్నీ వేడిని ఉపయోగిస్తుంది. టచ్ కంట్రోల్స్, మోషన్ సెన్సర్ వల్ల సాధారణ తాకడం లేదా చేతిని ఊపడం ద్వారా చిమ్నీని కంట్రోల్ చేయవచ్చు. ధరలు రూ.49 వేల నుంచి రూ.55 వేల వరకు ఉంటాయి.