క్రాష్ ల్యాండింగ్ చేసినందుకు కోట్ల రూపాయల ఫైన్

క్రాష్ ల్యాండింగ్ చేసినందుకు కోట్ల రూపాయల ఫైన్

గ్వాలియర్: విమానాన్ని క్రాష్ ల్యాండింగ్ చేసినందుకు ఓ పైలట్కు మధ్యప్రదేశ్ సర్కారు భారీ జరిమానా విధించింది. సరిగ్గా ల్యాండింగ్ చేయనందున ఎయిర్ క్రాఫ్ట్కు నష్టం వాటిల్లిందనే కారణంతో కెప్టెన్ మాజిద్ అక్తర్కు ప్రభుత్వం రూ.85 కోట్ల ఫైన్ వేసింది. క్రాష్ ల్యాండింగ్ వల్ల విమానం పాడవడంతో స్క్రాప్కు వేశామని, అందుకు రూ.60 కోట్లు జరిమానా చెల్లించాలని రాష్ట్ర సర్కారు పేర్కొంది. అదే సమయంలో ప్రైవేటు ఆపరేటర్ల నుంచి కొత్త ఎయిర్ క్రాఫ్ట్ కొనేందుకు మరో రూ.25 కోట్లు అవసరమవుతాయని.. మొత్తంగా రూ.85 కోట్లు కట్టాల్సిందేనని పైలట్ మాజిద్కు ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే విమానాలు నడపకుండా మాజిద్ ఫ్లయింగ్ లైసెన్స్ పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఏడాది పాటు నిషేధం విధించింది. ఈ ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో విచారణ చేస్తోంది. 

అసలేం జరిగిందంటే..

కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్లో ఇచ్చే రెమిడెసివిర్ బాక్సులతో కూడిన క్రాఫ్ట్ కింగ్ ఎయిర్ బీ 250 జీటీ అనే విమానం 2021, మే6న అహ్మదాబాద్ నుంచి గ్వాలియర్కు బయలుదేరింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఈ విమానం.. గ్వాలియర్ ఎయిర్ పోర్టులోని రన్ వేపై ల్యాండింగ్ అయ్యే సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ పోర్టులో ఓ కంచెను ఢీకొనడంతో విమానం పాడైంది. ఈ ఘటనలో ఎయిర్ క్రాఫ్ట్ నడుపుతున్న పైలట్ మాజిద్ అక్తర్, కోపైలట్లు శివ్ జైస్వాల్, నైబ్ తెహ్ సిల్దార్ దిలిప్ ద్వివేదీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద తీవ్రతకు విమానంలోని కాక్ పిట్ ముందుభాగంతోపాటు ప్రొపెల్లర్ బ్లేడ్లు, ప్రొపెల్లర్ హబ్, వీల్స్ పాడయ్యాయి. ఈ వివాదంపై పైలట్ మాజిద్ స్పందిస్తూ.. డీజీసీఏ విచారణ పూర్తయ్యేంత వరకు తాను దోషిని కాదన్నారు. ప్రమాదానికి కారణమైన కంచె ఎయిర్ పోర్టులో ఉందనే విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ) తనకు చెప్పలేదన్నారు. గ్వాలియర్ ఏటీసీకి సంబంధించిన సూచనలు కలిగిన బ్లాక్ బాక్స్ ఎయిర్ క్రాఫ్ట్ లో లేదని.. ఫ్లయింగ్ లో 27 ఏళ్లు అనుభవం కలిగిన మాజిద్ వాపోయాడు. 

మరిన్ని వార్తల కోసం:

నేను ఫ్రీ బర్డ్.. స్వేచ్ఛగా బతుకుతా

వైరల్ అవుతున్న ‘శ్రీవల్లి’ ఇంగ్లిష్ వెర్షన్

రాణించకుంటే జట్టులో ఎవ్వరినీ ఉంచరు