టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్‌తో బన్నీ సీక్రెట్‌గా భేటీ అయ్యాడని.. రాజకీయ అరంగ్రేటంపై పీకేతో చర్చలు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొదట పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని.. ఆ తర్వాత మెల్లగా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని బన్నీకి ప్రశాంత్ కిశోర్ సూచించినట్లు టాక్. పుష్ప రాజ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు జరుగుతోన్న ప్రచారం క్షణాల్లోనే వైరల్ అయ్యింది. ఇటు సినీ ఇండస్ట్రీతో పాటుతో పొలిటికల్ సర్కిల్స్‌లోనూ పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. దీంతో బన్నీ టీమ్ వెంటనే అలర్ట్ అయ్యింది. అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ వార్తలపై క్లారిటీ ఇచ్చింది.
ల్లు అర్జున్ రాజకీయ ప్రవేశం చేయబోతున్నట్లు జరుగుతోన్న ప్రచారమంతా ఫేక్ అని.. అవి పూర్తిగా తప్పుడు వార్తలని బన్నీ టీం ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేని తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేసింది. దీంతో బన్నీ పొలిటికల్ ఎంట్రీ వార్తల ప్రచారానికి ఎండ్ కార్డు పడింది. కాగా, ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి తరఫున అల్లు అర్జున్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. శిల్పా రవిచంద్ర మిత్రుడు కావడంతో బన్నీ తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి వెళ్లి ప్రచారం చేశారు. బన్నీ వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేయడంపై మెగా ఫ్యామిలీ భగ్గుమంది. దీనికి కారణం మెగా హీరో పవన్ కల్యాణ్ జనసేన పార్టీ వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం చేయడమే.
ALSO READ | ఎవరి కోరిక సామీ: ప్రశాంత్ కిషోర్‌తో అల్లు అర్జున్ భేటీ..!?
బన్నీ వైసీపీకి సపోర్ట్ చేయడమంటే పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా ఉన్నట్లే అన్న వార్తలు అప్పట్లో గుప్పుమన్నాయి. ఈ పరిణామంతో మెగా, అల్లు రెండు ఫ్యామిలీల మధ్య దూరం పెరిగిందని ప్రచారం జరిగింది. ఏపీలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంతో బన్నీపై విపరీతంగా ట్రోల్స్ పెరిగాయి. ఒక దశలో పుష్ప–2 విడుదలపైనా అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. విడుదల తర్వాత పుష్ప–2 రికార్డుల మోత మోగిస్తోంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ నార్త్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం బన్నీకి దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ తరుణంలో ఆయన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో భేటీ అయినట్లు ప్రచారం జరగడంతో.. పుష్ప రాజ్ త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి.
తన మామ పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం, తమిళ స్టార్ విజయ్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంతో అంశాలను పరిగణలోకి తీసుకుని బన్నీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడట. కూటమి విజయంతో పవన్ డిప్యూటీ సీఎం కాగా.. ఇటీవల దళపతి నిర్వహించిన బహిరంగ సభ కూడా ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో చూశాం. ఈ నేపథ్యంలో బన్నీ పొలిటికల్ ఎంట్రీకి ప్లాన్ చేస్తోన్నట్లు టాక్. మరీ అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ వార్తలను ఆయన టీం ఖండించగా.. ప్యూచర్ లోనైనా బన్నీ రాజకీయాల్లోకి వస్తారని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు.